బిజినెస్

దేశీయ ఆక్వా రంగంలో ప్రమాద ఘంటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 10: దేశీయ ఆక్వా రంగంలో అత్యధిక మోతాదులో యాంటీ బయోటిక్స్ వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని జర్మనీ దేశానికి చెందిన ఫుడ్ సేఫ్టీ, టెస్టింగ్ సర్ట్ఫికేషన్ సంస్థ టువ్ సుడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాన్ వాకర్ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తులకు బ్యాక్టీరియల్ వ్యాధులు సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సముద్ర ఆహార భద్రత, సీఫుడ్, వ్యవసాయ ఎగుమతిదారులు, అంతర్జాతీయ పరిశోధనా నిపుణులతో టువ్‌సుడ్ సంస్థ బుధవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఆక్వా ట్రేడర్లు, ఎగుమతిదారులు, ఆక్వా రైతులు హాజరైన ఈ సదస్సులో రాన్‌వాకర్ మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ పరిధిలో 28 దేశాలకు చెందినవారు టువ్ సుడ్‌లో సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ దేశాలు యేటా 12.3 మిలియన్ టన్నుల సముద్ర ఉత్పత్తులను వినియోగిస్తున్నాయని తెలిపారు. యూరోపియన్ సీఫుడ్ మార్కెట్ ఆహార చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. యూరప్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల నాణ్యతా పరీక్షలు, ఆహార భద్రత వ్యవస్థల్లో తాజా మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ఇందుకోసం స్వతంత్ర పరీక్ష, పరిశీలన, సర్ట్ఫికేషన్ సంస్థలతో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు భాగస్వామ్యం చేసుకోవడంవల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేయబోయే దేశాల్లో తప్పనిసరిగా నిర్దేశిత యంత్రాంగం ఉండాలన్నారు.
ఈ ఉత్పత్తి చైన్ మొత్తం అధికారుల నియంత్రణలో ఉండటంతోపాటు వారే బాధ్యత వహించేలా చూడాలన్నారు. పరిశుభ్రత, ప్రజారోగ్య అవసరాలకు సంబంధించిన ప్రమాణాలు అనుసరిస్తున్నామని జాతీయ అధికారులు హామీ ఇవ్వాలన్నారు. దేశంలో భార ఖనిజాలు, కాలుష్యకారకాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎరువుల అవశేషాలు, వెటర్నరీ డ్రగ్స్‌ను నియంత్రించడానికి ప్రణాళిక ఉండాలన్నారు. ఫుడ్ హెల్త్ అసిస్టెంట్ వైఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ పంకజ్ జైమినీ, రాహుల్ సోమన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

చిత్రం..అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతున్న రాన్‌వాకర్