బిజినెస్

మూడురెట్లు పెరగనున్న ఆన్‌లైన్ గేమర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: భారత్‌లో ఆన్‌లైన్ గేమర్ల సంఖ్య ఇప్పుడున్న 12 కోట్లనుంచి 2021 నాటికి దాదాపు మూడు రెట్లు అంటే 31 కోట్లకు పెరుగుతుందని గూగుల్ ఇండియా కెపిఎంజి సంస్థలు రూపొందించిన ఒక నివేదిక అంచనా వేసింది. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ పెరుగుదలతో పాటుగా 2021 నాటికి దేశంలో ఈ పరిశ్రమ విలువ వంద కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది.‘ భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ఏడాదికి 20 శాతం వృద్ధితో 2021 నాటికి ఇప్పుడున్న 36 కోట్ల డాలర్లనుంచి వంద కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. ఆన్‌లైన్ గేమ్స్‌కోసం వెతికే వారి సంఖ్య 117 శాతం చొప్పున పెరుగుతున్న నేపథ్యంలో 2016లో ఉన్న 12 కోట్ల ఆన్‌లైన్ గేమర్ల సంఖ్య 2021 నాటికల్లా 31 కోట్లకు పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. కాగా, ఆన్‌లైన్ గేమ్స్ కోసం వెతికే వారిలో సగం మంది రెఫరల్స్, ఇంతకు ముందు వీక్షించిన గ్రూపుల ప్రభావం కారణంగా నిర్దిష్టమైన గేమ్‌ను ఎంచుకొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది.
అంతేకాదు ఈ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే వారిలో 75 శాతం మందికి 20 వేలకన్నా తక్కువ విలువ కలిగిన సొంత స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయని, ఎంటర్‌టైన్‌మెంట్‌లో తాము ఖర్చు చేసే బడ్జెట్‌లో మూడింట ఒక వంతు గేమ్స్‌పై ఖర్చు చేస్తున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారి జీవితాల్లోకి చాలావరకు స్ట్రాటజీ గేమ్స్ స్థానం పొందుతున్నాయని, మరోవైపు సరదాగా గేమ్స్ ఆడే వారు పజిల్స్ లాంటి వాటిని ఎంచుకొంటున్నారని కూడా ఆ నివేదిక వెల్లడించింది. దేశంలో స్మార్ట్ ఫోన్లను వాడే వారి సం ఖ్యతో డిజిటల్ చెల్లింపులు సైతం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆన్‌లైన్ గేమ్స్ కోసం వెతికే వారిసంఖ్య వందశాతం దాకా పెరిగింది. పెయిడ్ గేమ్స్ తో పోలిస్తే టాప్ 100 ‘ఫ్రీమియమ్ గేమ్స్’ ద్వారా వచ్చే రాబడి సైతం 22 రెట్లు పెరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. నీల్సన్ హోల్డింగ్ నిర్వహించిన ఈ సర్వే కోసం ఢిల్లీ-ఎన్‌సిఆర్, జైపూర్, లక్నో, చెన్నై, బెంగళూరు లాంటి 16 నగరాల్లో 18నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 3 వేల మందిని ఇంటర్వ్యూ చేశారు.