బిజినెస్

ఎస్‌బిఐ లైఫ్ నుంచి భారీ ఐపిఓ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ముంబయి, మే 13: త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌బిఐ లైఫ్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) దాదాపు ఏడేళ్ల కాలంలో వస్తున్న అతి పెద్ద ఐపిఓగా నిలవనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్‌బిఐ 6500 కోట్ల రూపాయల నిధులను సేకరించాలని అనుకుంటోంది. వాస్తవానికి ఎస్‌బిఐ లైఫ్ ప్రధాన ప్రమోటర్లయిన ఎస్‌బిఐ, ఐరోపాకు చెందిన ఇన్సూరెన్స్ దిగ్గజం కార్డ్ఫి కలిపి మొత్తం 12 శాతం వాటాను విక్రయించాలని అనుకుంటున్నాయి. ఈ 12 శాతం వాటా కలిపి రూ. 50 వేల కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. కాగా, ఈ పబ్లిక్ ఇష్యూ కోసం ఎనిమిది మర్చెంట్ బ్యాంకర్లను నియమించే ప్రక్రియలో ఉన్నట్లు శుక్రవారం ఎస్‌బిఐ తెలిపింది. ఈ ఐపిఓ నిర్వహణకు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, సిటి గ్రూప్, బిఎన్‌పి పరిబాస్, డ్యూషే బ్యాంక్, కోటక్, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్, జెఎం ఫైనాన్షియల్‌లను నియమించాలని ఎస్‌బిఐ లైఫ్ అనుకుంటోంది.ఇప్పటివరకు కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూయే గత ఏడేళ్లలో అతి పెద్ద ఐపిఓగా గుర్తింపు పొందింది. 2010 అక్టోబర్‌లో కోల్ ఇండియా ఐపిఓ ద్వారా 15,400 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకుంది. దానికన్నా ముందు 2008 జనవరిలో ఐపిఓకు వెళ్లిన రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమకూర్చుకుంది. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.6,057 కోట్ల ఇష్యూతో మార్కెట్లోకి వచ్చింది. ఎస్‌బిఐ లైఫ్ కొత్తగా మూలధనాన్ని సమకూర్చుకోవలసిన అవసరం లేని కారణంగా ఈ ఐపిఓలో ఎస్‌బిఐ, కార్డ్ఫికు చెందిన షేర్లను మాత్రమే విక్రయించే అవకాశం ఉంది. ఐపిఓకి వెళ్లాలన్న నిర్ణయానికి ఎస్‌బిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర కూడా లభించింది. ఈ ఐపిఓ ద్వారా ఎస్‌బిఐ దాదాపు 8 శాతం వాటాలను విక్రయించనుండగా, కార్డ్ఫి 4 శాతం వాటాలను విక్రయిస్తుంది.