బిజినెస్

మాపైనా పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 13: భారత్ సహా దాదాపు వంద దేశాలపై సైబర్ నేరగాళ్లు పంజా విసరడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురై వివిధ రంగాలకు చెందిన పలు పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ సైబర్ దాడితో తమకూ నష్టం వాటిల్లిందని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘రెనాల్ట్’ యాజమాన్యం శనివారం వెల్లడించింది. ‘సైబర్ నేరగాళ్ల నిర్వాకం వలన మా సంస్థకూ నష్టం వాటిల్లింది. భీకర స్థాయిలో జరిగిన ఈ దాడి వలన అంతటా గందరగోళం నెలకొంది. దీంతో సమస్య తీవ్రతను అంచనా వేసి పరిష్కార మార్గాన్ని కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ దాడిని ప్రతిఘటించేందుకు ఏమి చేయాలన్న దానిపైనే మేమిప్పుడు దృష్టి కేంద్రీకరించాం’ అని రెనాల్ట్ సంస్థకు చెందిన మహిళా అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. సైబర్ దాడి కారణంగా నోవో మెస్తోలోని తమ అనుబంధ సంస్థ ‘రెవోజ్’ ప్రధాన కార్యాలయంలో అనేక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురవడంతో స్లొవేనియాలో రెనాల్ట్ కార్ల ఉత్పత్తి ఆగిపోయిందని ఆమె తెలిపారు. ‘సైబర్ దాడి కారణంగా రెవోజ్ ప్రధాన కార్యాలయంలోని సమాచార వ్యవస్థలో శుక్రవారం కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి మేము అక్కడ కార్ల తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం కూడా కార్ల ఉత్పత్తిని పునరుద్ధరించలేకపోయాం’ అని ఆమె పేర్కొన్నారు. తమ సంస్థలపై సైబర్ నేరగాళ్లు జరిపిన దాడులతో ప్రధానంగా ఫ్రాన్స్‌లోని రెనాల్ట్ కర్మాగారాల్లో సమస్యలు తలెత్తాయని, కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురవడంతో సమాచార వ్యవస్థలోని కొన్ని భాగాలు సరిగా పనిచేయడం లేదని ఆమె తెలిపారు. సైబర్ నేరగాళ్ల దాడితో తమకు నష్టం వాటిల్లిందని ధ్రువీకరించిన తొలి ఫ్రెంచి పారిశ్రామిక సంస్థ రెనాల్టే.