బిజినెస్

ఇ-వ్యాలెట్ లావాదేవీలపై చార్జీలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 13: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతున్న ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తమ మొబైల్ వ్యాలెట్ ద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు విధించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బిఇఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. వినియోగదారులు తమ మొబైల్ వ్యాలెట్‌ను ఉపయోగించుకుని ఎటిఎంల ద్వారా జరిపే ప్రతి నగదు ఉపసంహరణపై 25 రూపాయల చొప్పున చార్జీ వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఎస్‌బిఐ గత వారం వెల్లడించిన విషయం విదితమే. అయితే ఈ ఆలోచనను తక్షణమే విరమించుకోవాల్సిందిగా భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఎస్‌బిఐని కోరిందని బిఇఎఫ్‌ఐ తమిళనాడు శాఖ ప్రధాన కార్యదర్శి సిపి.కృష్ణన్ తెలిపారు. దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమలో జరుగుతున్న మొత్తం వ్యాపారంలో ఇప్పటికే 25 శాతం వాటాను కలిగివున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకులు విలీనమవడంతో ఆ వాటా 33 శాతానికి పెరిగిన విషయాన్ని కృష్ణన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎటిఎంల ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను విధించాలని తొలుత తీసుకున్న నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చుకుని ఇ-వ్యాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను విధించాలని భావిస్తోందని, అంతేకాకుండా మురికి నోట్ల మార్పిడిపై చార్జీలను విధించాలని కూడా ఎస్‌బిఐ యోచిస్తోందని ఆయన తెలిపారు. సర్వీసు చార్జీలు, జరిమానా పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం దేశంలోని సామాన్య ప్రజలపై యుద్ధాన్ని ప్రారంభించిందని కృష్ణన్ ధ్వజమెత్తారు. ఇటువంటి చర్యలతో ప్రభుత్వ రంగంలోని ఇతర బ్యాంకుల పట్ల ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొదుపు ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఉంచాలన్న నిబంధనను రద్దు చేస్తామని 2012లో ఎస్‌బిఐ ప్రకటించిందని, అయితే ఇటువంటి ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఉంచని వారి నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా పెంచుతున్నట్లు ఆ బ్యాంకు కొత్తగా ప్రకటించడంతో దేశంలో కోట్లాది మంది ప్రజలు బ్యాంకింగ్‌కు దూరమవడం ఖాయమని కృష్ణన్ పేర్కొన్నారు. ఎస్‌బిఐ నిర్ణయాన్ని తాము తీవ్రంగా గర్హిస్తున్నామని, ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఎస్‌బిఐ యాజమాన్యాన్ని ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును డిమాండ్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.