బిజినెస్

దేశ ఆర్థికాభివృద్ధిలో విమానయాన రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 15: దేశ ఆర్థికాభివృద్ధిలో విమానయాన రంగానిది కీలక పాత్రని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతి రాజు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడ్ని కోల్పోయిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను పరామర్శించేందుకు మంత్రి అశోకగజపతిరాజు నెల్లూరు విచ్చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామీణుల ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో విమానయాన రంగం కూడా తన వంతు పాత్ర పోషించబోతోందన్నారు. ప్రపంచ ఆర్థిక సర్వే ప్రకారం ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో ఒక ప్రత్యక్ష ఉద్యోగం ఏర్పడితే ఆరు పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల అభివృద్ధికి, దేశంలో ఉత్పత్తి అయ్యే ఎన్నో వస్తువులను త్వరితగతిన ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు విమానయాన రంగం పని చేస్తుందన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తాము అంతర్జాతీయస్థాయి వౌలిక వసతులు కల్పించినప్పటికి విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకు రావాల్సి ఉంటుందని, ఆ దిశగా కూడా చర్యలు పూర్తయినట్లు వెల్లడించారు.
త్వరలో నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్దేశించిన ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిన్న చిన్న భూసేకరణ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఆ సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించగలిగితే తాము అంతే త్వరగా పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

చిత్రం..కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు