బిజినెస్

లక్ష్యం..రూ.6వేలకోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి/హిందూపురం రూరల్, మే 15: హెరిటేజ్ డెయిరీ వచ్చే 2020 నాటికి రూ. 6 వేల కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. హెరిటెజ్ డెయిరీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని అనంతపురం జిల్లా లేపాక్షి మండల పరిధిలోని హెరిటేజ్ డెయిరీ, హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూమకుంట పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ దాణా మిశ్రమ కేంద్రాన్ని బ్రాహ్మణి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ డెయిరీలో గోపూజ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1992లో పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెరిటేజ్ డెయిరీని స్థాపించారన్నారు. ప్రతి ఇంటా ఓ ఆవు నినాదంతో ప్రతి రైతు కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో 15 డెయిరీ కేంద్రాలతో 200 మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి 2,500 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజు 14 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నామన్నారు. 15 రోజులకొకసారి పాల బిల్లులను రైతులకు చెల్లిస్తోందన్నారు. అనంతరం బసవనపల్లికి చెందిన గంగాధరప్ప అనే పాడిరైతు ప్రమాదవశాత్తు చనిపోగా అతని భార్యకు రూ.2 లక్షల చెక్కు అందచేశారు. హెరిటేజ్ సంక్షేమ నిధి ద్వారా పాడి రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అనంతరం తూమకుంట పారిశ్రామికవాడలోని హెరిటేజ్ దాణ కర్మాగారం మిశ్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట బిసి కార్పొరేషన్ ఛైర్మన్ రంగనాయకులు, హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మీ, తెలుగుదేశం నేత నాగరాజు, ఎండి కామేశ్వరరావు, ఆర్‌ఎం తులసీనాయక్, మేనేజర్ సురేంద్రనాయుడు, పశు సంవర్థకశాఖ జెడి తిప్పేస్వామి, డాక్టర్ హేమలత పాల్గొన్నారు.

చిత్రం..తూమకుంట పారిశ్రామికవాడలోని హెరిటేజ్ దాణా కర్మాగారంలో
మిశ్రమాన్ని పరిశీలిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి