బిజినెస్

రెండు లక్షల టన్నులకు చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయిలో ఉన్నందున విద్యుత్తు ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉండేలా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్షించారు. రోజువారి ఉత్పత్తి 2 లక్షల టన్నులకు చేరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 1.5-1.6 లక్షల టన్నులుంది.
కాగా, సింగరేణితో బొగ్గు సరఫరా ఒప్పందం గల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఈ వేసవిలో తగినంత బొగ్గు సరఫరా చేయడం సంతోషకరమన్నారు. ఇకపై కూడా ఏ ఒక్క ప్లాంటులోనూ బొగ్గు నిల్వలలో కొరత లేకుండా చూడాలని, దీని కోసం రోజుకు కనీసం రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాలన్నారు. రానున్న వర్షాకాలంలో ఒసి గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి జరిగేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు.