బిజినెస్

రికార్డు పరుగులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుస లాభాలతో రోజుకో సరికొత్త స్థాయిలను చేరుకుంటున్న సూచీల రికార్డులకు బ్రేక్ పడినట్లైంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.93 పాయింట్లు పతనమై 31,190.56 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 37.95 పాయింట్లు కోల్పోయి 9,637.15 వద్ద నిలిచింది. మంగళవారం ట్రేడింగ్‌లో మదుపరులు కొనుగోళ్లు-అమ్మకాల మధ్య ఊగిసలాడగా, ఒకానొక దశలో సెనె్సక్స్ 31,430.32 పాయింట్లను, నిఫ్టీ 9,709.30 పాయింట్లను తాకి మునుపెన్నడూ లేని ఇంట్రా-డే రికార్డులను నెలకొల్పాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష బుధవారం జరగనున్న క్రమంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు నష్టపోక తప్పలేదు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పవర్, ఇండస్ట్రియల్స్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల షేర్ల విలువ 2.01 శాతం నుంచి 1.08 శాతం మధ్య దిగజారింది. అయితే ఐటి, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ మాత్రం 2.33 శాతం, 1.64 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడితే, జపాన్ సూచీ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో కీలక సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టాల్లో కదలాడాయి.