బిజినెస్

తగ్గిన ఒమాక్స్ లిమిటెడ్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: నిర్మాణ రంగ సంస్థ ఒమాక్స్ లిమిటెడ్ విక్రయాల బుకింగ్స్ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 43 శాతం క్షీణించి 946 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. మదుపరులకు తెలియజేసిన వివరాల ప్రకారం 2016-17లో 3.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయాలు జరిగాయని ఓమాక్స్ తెలిపింది. 2015-16లో ఇది 4.89 మిలియన్ చదరపు అడుగుల అమ్మకాలుగా ఉన్నాయంది. 2015-16లో సగటున చదరపు అడుగు ధర 3,372 రూపాయలు పలికితే, 2016-17లో 2,956 రూపాయలుగా ఉందని తెలిపింది. దీంతో ఈసారి 12 శాతం ధర పడిపోయిందని చెప్పింది.