బిజినెస్

కీలక వడ్డీరేట్లు యథాతథం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులు జరిగే ఈ సమీక్షలో బుధవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలు రానున్నాయి. అయితే ఈసారి ఆర్‌బిఐ.. కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే వీలుందన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చేలా రుణాలపై వడ్డీరేట్లు తగ్గేలా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలున్నా.. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన ఆర్‌బిఐని వెంటాడుతోంది.
ఈ క్రమంలోనే ఈసారి వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాలే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ద్రవ్యవ్యవస్థలో 60 బిలియన్ డాలర్లకుపైగా నిధులు అందుబాటులో ఉండటం కూడా ఆర్‌బిఐని వడ్డీరేట్ల తగ్గింపునకు దూరంగా ఉంచుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు దిగివచ్చిన నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపును కోరుతున్నారు కొందరు వ్యాపార, పారిశ్రామికవేత్తలు. అంతేగాక 1992 నుంచి గమనిస్తే అత్యంత పేలవమైన లోన్ డిమాండ్, గడచిన రెండేళ్లలో దేశ జిడిపి వృద్ధిరేటు మందగించడంతో వడ్డీరేట్లను ఆర్‌బిఐ తప్పక తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం వడ్డీరేట్లను తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులోనే ఉన్నాయని, వర్షాలు కూడా ఈసారి సమృద్ధిగానే కురుస్తాయన్న అంచనాలున్నాయని, చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల ఇప్పుడు ఉండబోదన్న భరోసా సైతం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ నుంచి కనిపిస్తుండటంతో దేశ జిడిపి వృద్ధి, దానికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బిఐ వడ్డీరేట్లు తగ్గాలని జైట్లీ అన్నారు.
నిజానికి ఇప్పుడున్న పరిస్థితులు వడ్డీరేట్ల తగ్గింపునకు ఎంతగానో అవకాశం కల్పిస్తున్నాయన్న ఆయన ఏ ఆర్థిక మంత్రైనాసరే ప్రస్తుతం వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించాలనే కోరుకుంటారని, తానూ అదే చేస్తున్నానని చెప్పారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి)దేనని స్పష్టం చేశారు.