బిజినెస్

హంక్, ఇగ్నైటర్, డాన్ అమ్మకాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలోని ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో అతిపెద్దదైన హీరో మోటోకార్ప్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా తమ ఉత్పత్తుల శ్రేణిని పునర్‌వ్యవస్థీకరించి ప్రీమియం బైకులు, స్కూటర్లపై దృష్టి సారించేందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వేర్వేరు మోడళ్లు, వేరియంట్లను తొలగించింది. ఇప్పటికే మ్యాస్ట్రో స్కూటర్, ప్యాషన్ ఎక్స్‌ప్రో, స్ప్లెండర్ ప్రో క్లాసిక్, కరిజ్మా-ఆర్ మోటార్ సైకిళ్ల అమ్మకాలను నిలిపివేసిన ఆ సంస్థ తాజాగా ఇగ్నైటర్, హంక్, హెచ్‌ఎఫ్ డాన్ బైకుల అమ్మకాలను కూడా నిలిపివేసింది. హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం తమ సంస్థ ప్రీమియం బైకులు, స్కూటర్ల సెగ్మెంట్‌పై దృష్టి సారించేందుకు ఉత్పత్తుల శ్రేణిని పునర్ వ్యవస్థీకరించే ప్రక్రియను చేపట్టిందని, దీనిలో భాగంగా ఇప్పటికే గ్లామర్, మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యూయెట్, ప్లెజర్ మోడళ్లకు కొత్త వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోని 100 సిసి, 150 సిసి సెగ్మెంట్లలో 50 శాతానికి పైగా వాటా కలిగివున్న తమ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అరడజను కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ ఆరింటిలో రెండు మోడళ్లను సెప్టెంబర్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ తర్వాత ఆటో ఎక్స్‌పో-2018లో సరికొత్త 200 సిసి మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెడతామని ఆయన వివరించారు.