బిజినెస్

ఆందోళనలు అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికిగాను ఎగుమతిదారులతోసహా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక భాగస్వాములతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తోంది. ఇందులో భాగంగానే సదరు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి).. ఓ జిఎస్‌టి ఫెసిలిటేషన్ సెల్‌ను తాజాగా ఏర్పాటు చేసింది. ప్రస్తుత పన్ను విధానం నుంచి జిఎస్‌టి విధానంలోకి సులువుగా మారేలా ఎగుమతిదారులకు, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ఈ సెల్ తగు సలహాలు, సూచనలను అందిస్తుంది.
‘జిఎస్‌టి వ్యవస్థలో వ్యాపారులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునేందుకు ఓ సమావేశాన్ని కూడా డిజిఎఫ్‌టి ఏర్పాటు చేసింది. ఈ సమస్యలను రెవిన్యూ, జిఎస్‌టి నెట్‌వర్క్‌ల వద్దకు అది తీసుకెళ్తుంది.’ అని ఓ ప్రకటనలో వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా వరకు సమస్యలను రెవిన్యూ, జిఎస్‌టిఎన్‌లే తీరుస్తున్నాయని గుర్తుచేసింది. అన్ని డిజిఎఫ్‌టి ప్రాంతీయ కార్యాలయాల్లో జిఎస్‌టి ఫెసిలిటేషన్ సెల్ ఉంటుందని పేర్కొంది. అక్కడకు వెళ్లి జిఎస్‌టి విధానంపై తమ సందేహాలను అందరూ తీర్చుకోవచ్చని స్పష్టం చేసింది.
సువిధ ప్రొవైడర్లకు సూచనలు
ఇదిలావుంటే నూతన పరోక్ష పన్నుల విధానమైన జిఎస్‌టి అమలు దగ్గర పడుతున్న క్రమంలో ఐఎస్‌ఒ ప్రమాణాల ప్రకారం తమ సిస్టమ్స్‌ను ఆడిటెడ్ చేసుకోవాలంటూ జిఎస్‌టి సువిధ ప్రొవైడర్లను జిఎస్‌టి నెట్‌వర్క్ కోరింది. జిఎస్‌టి నెట్‌వర్క్‌లోకి డేటా ఫీడింగ్ ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తవ్వాలని సూచించింది. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే.