బిజినెస్

టిటిడికి జిఎస్‌టి మినహాయంపునకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ఏపి విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించినట్టు సూత్రప్రాయంగా తెలుస్తొంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జిఎస్‌టి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సేవా పన్నులకు మినహాయింపు ఇవ్వాలని కోరామని, వీటికి సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేసినట్టు తెలిపారు. గ్రానైట్, మార్బుల్ పరిశ్రమలకు జిఎస్‌టిలో 28 శాతం నుంచి పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. పొగాకు, బీడీ ఉత్పత్తులకు జిఎస్‌టి పన్ను తగ్గింపు ఉండదని అధికారులు స్పష్టం చేసినట్టు చెప్పారు. ఎండు చేపలు, అలాగే చేపల వలలకు పన్ను మినహాయింపు కోరినట్టు యనమల పేర్కొన్నారు. రెస్టారెంట్, హోటళ్లకు ఏసీ, నాన్ ఏసీల మధ్య పన్ను విధింపు వేర్వేరుగా ఉండాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. టిటిడికి సంబంధించిన నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు వస్తువుల కొనుగోలు, అద్దె గదులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పన్ను మినహాయింపును జిఎస్‌టిలో కూడా కల్పించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అయితే దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వచ్చే జిఎస్‌టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మధ్య, చిన్నతరహా పరిశ్రమల పరిధికి వచ్చే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పన్నులు ఎంత ఉండాలనేది తదుపరి సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. జూన్ 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్టు ఆయన వెల్లడించారు.