బిజినెస్

కట్ట కొత్తిమీర నలభై రూపాయలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూన్ 11: నిత్యం వంటల్లో వాడే కొత్తిమీర ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. స్థానికంగా సాగు లేక కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ధర విపరీతంగా పెరిగిందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. కొత్తిమీర చలికాలంలో మాత్రమే మన ప్రాంతంలో పండుతుందంటున్నారు. కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు జరుగుతుండటంతోపాటు వాతావరణ అననుకూల పరిస్థితి కారణంగా కొత్తిమీరకు గిరాకీ ఏర్పడింది. గతంలో కొత్తిమీర కట్టను 10 రూపాయలలోపు అమ్మే వ్యాపారులు ఇప్పుడు అదే కట్టను 40 రూపాయలకు విక్రయిన్నారు. ఇదేమని అడిగితే మూట కొత్తిమీరను 4 వేల రూపాయలు ధర వెచ్చించి కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.