బిజినెస్

జిఎస్‌టికి నిరసనగా పొగాకు కొనుగోళ్ళు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 12: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో 28 శాతం విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా పొగాకు కొనుగోళ్ళను నిలిపివేసి సోమవారం రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ముడి పొగాకుపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జిఎస్‌టిని విధించినందుకు నిరసనగా నవ్యాంధ్రలోని ప్రకాశం, నెల్లూరు, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు నిలిపివేసి రైతులు తమ నిరసనను తెలియచేశారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు ఆరువేల పొగాకు బేళ్ళవరకు కొనుగోళ్ళు నిలిచిపోయాయని రైతు సంఘం నాయకుడు పమ్మి బధ్రిరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని జిఎస్‌టి నుండి మినహాయించారని, అందువలన ఆ కోటాలో పొగాకు పంట ఉన్నందున జిఎస్‌టిని తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎఫ్ -1, ఎఫ్ -2 గ్రేడ్ పొగాకు రకం కేజి 170 రూపాయల వరకు ధర పలుకుతోందని అదేవిధంగా లోగ్రేడ్ పొగాకు కేజి 80 రూపాయల వరకు ఉందని ఈ జిఎస్‌టి విధానాన్ని అమలుచేస్తే పొగాకు రేట్లు తగ్గి రైతులు నష్టపోతారని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వన్, టూ, కందుకూరు, పొదిలి, కొండెపి, కనిగిరి, టంగుటూరుల్లోని పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను నిషేధించిన రైతు సంఘాల నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వేలం అధికారులకు సమర్పించారు. మొత్తంమీద కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్‌టిని ఎత్తివేయాలని అన్ని రైతు సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
తూర్పుగోదావరిలో..
రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని తొర్రేడు పొగాకు వేలం కేంద్రంలో సోమవారం పొగాకు వేలం ప్రక్రియను రైతులు నిలిపివేశారు. పొగాకుపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పేరిట 5 శాతం పన్ను విధింపును నిరసిస్తూ వేలం కేంద్రం పరిధిలోని రైతులంతా విక్రయాలు నిలిపివేశారు. ముడి పొగాకు ఉత్పత్తులపై జిఎస్‌టి విధించడంవల్ల వ్యాపారులు పొగాకు కొనుగోలు చేసే సమయంలో ధరలు తగ్గించే అవకాశం ఉందని, అందుకే జిఎస్‌టికి నిరసనగా విక్రయాలు నిలిపివేశామని జిల్లా వర్జీనియా పొగాకు ఫార్మర్స్ అసోసియేషన్ నాయకుడు కెవి సత్యనారాయణ తెలిపారు.