బిజినెస్

పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం సోమవారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించింది. అనంతరం పోర్టు ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఇఒ అనిల్‌కుమార్ యండ్లూరి పోర్టు పరిపాలనా భవనంలో పోర్టు అభివృద్ధిపై వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న భూమి, వౌలిక వసతుల వివరాలను ఎపిఐఐసి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో సానుకూలమని వారు తెలిపారు. దేశంలో ఏర్పాటు చేయనున్న కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏర్పాటుకు ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నట్లు నీతి అయోగ్ అధికారులకు, పరిశ్రమల అధికారులకు వివరించారు. కృష్ణపట్నం పరిసర ప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన భూమితోపాటు నీరు, విద్యుత్, రైలు, రోడ్డు మార్గాలతోపాటు అన్ని వౌలిక వసతులు బాగున్నాయని ఎపిఐఐసి ఎండి బాబు పేర్కొన్నారు. తదుపరి నీతి అయోగ్ అధికారులు మాట్లాడుతూ కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో అన్ని వౌలిక వసతులు కలిగి ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై నీతి అయోగ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్‌పై పోర్టు ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ కమిటీ సభ్యులు సంజయ్ గుప్తా, యదువీదర్ మాతూర్, సుధీర్‌కుమార్, అతిషా కుమార్, ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పి కృష్ణయ్య, ఎండి బాబు, పరిశ్రమల కమిషనర్ సిద్ధార్ జైన్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు ప్రద్యుమ్న, ముత్యాలరాజు, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, పోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కృష్ణపట్నం పోర్టు పరిపాలనా భవనంలో సాగరమాల ప్రాజెక్టుపై చర్చిస్తున్న నీతి అయోగ్ కమిటీ బృందం