బిజినెస్

బ్యాంకింగ్ షేర్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయిల ప్రభావం మదుపరులపై పడింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ విలువ 1.88 శాతం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ షేర్ విలువ 1.20 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 1.18 శాతం మేర దిగజారింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లూ 4.58 శాతం మేర క్షీణించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 166.36 పాయింట్లు పడిపోయి 31,095.70 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 51.85 పాయింట్లు కోల్పోయి 9,616.40 వద్ద నిలిచింది.