బిజినెస్

ఐఆర్‌డిఎఐ చేతికి సహారా లైఫ్ ఇన్సూరెన్స్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. సోమవారం సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారం పర్యవేక్షణకు తమ జనరల్ మేనేజర్లలో ఒకరైన ఆర్‌కె శర్మను అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. జీవిత బీమా పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా సుబ్రతా రాయ్ నేతృత్వంలోని సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యవహారశైలి ఉందంటూ ఐఆర్‌డిఎఐ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్, మే నెలల్లో 1.53 కోట్ల రూపాయల విలువైన 665 పాలసీలను సంస్థ అమ్మింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 16,058 మంది కస్టమర్ల నుంచి 44.68 కోట్ల రూపాయల ప్రీమియంను వసూలు చేసింది.