బిజినెస్

8,200 ఎకరాల్లో ఫార్మాసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: అక్టోబర్‌లో ఫార్మాసిటీని ప్రారంభించనున్నట్టు, ఈ నెల 17న మెడికల్ డివైజెస్ పార్క్‌ను మొదలు పెట్టనున్నట్టు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి సోమవారం ఇక్కడ విడుదల చేశారు. ఫార్మాసిటీ మొదటి దశ 8,200 ఎకరాల్లో ప్రారంభం అవుతుందని, ఇప్పటికే 6,300 ఎకరాలు సేకరించినట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోసం పరిశ్రమల యాజమాన్యాలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసే స్థితి నుంచి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసే స్థితికి తెలంగాణ పురోగమించిందని చెప్పారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టిఎస్‌ఐపాస్ వంటి విధానం లేదన్నారు. తెలంగాణలోని పరిశ్రమలన్నీ తరలిపోతాయి అని ప్రచారం చేశారని, కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. టిఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 3,828 పరిశ్రమలకు అనుమతి ఇచ్చినట్టు, 73 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు. ఈ పరిశ్రమల వల్ల 2.46 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో ఎనిమిది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించినట్టు కెటిఆర్ వివరించారు. అనుమతి పొందిన పరిశ్రమల్లో సగం పరిశ్రమలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. జిఎస్‌డిపి జాతీయ వృద్ధిరేటు 7.10 శాతం అవగా, తెలంగాణ వృద్ధిరేటు 10.10 శాతం అని గుర్తుచేశారు. కాగా, టిఎస్‌ఐపాస్‌ను జూన్ 12న ఆవిష్కరించినందున ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 12న పరిశ్రమల వార్షిక నివేదిక విడుదల చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు.
కేంద్రం స్పందించాలి
ఐటిఐఆర్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అన్నారు. విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ఉందని, కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కెటిఆర్ చెప్పారు. ఎలాంటి ఉక్కు నిల్వలు లేని విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయిందని, ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ఫ్యాక్టరీ లేదన్నారు. కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి ఈ అంశంపై వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. అలాగే చత్తీస్‌ఘడ్ నుంచి ఐరన్ ఓర్ నిల్వలు రవాణా చేసుకోవడానికి ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. దీనిపై కేంద్రం కమిటీ వేసిందని, అక్టోబర్‌లో నివేదిక వస్తుందని పేర్కొన్నారు. కాగా, యుపిఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిందని, మూడేళ్లవుతున్నా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కెటిఆర్ తెలిపారు. ఈ నెల 15న ఖమ్మంలో ఐటి పార్క్ శంకుస్థాపన చేయనున్నట్టు కెటిఆర్ చెప్పారు.

చిత్రం.. సోమవారం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను ప్రారంభిస్తున్న కెటిఆర్