బిజినెస్

మందగమనంలో ఐఐపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ధిరేటు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.1 శాతానికి పతనమైంది. తయారీ, గనులు, విద్యుత్ రంగాల్లో పేలవమైన ప్రదర్శన నమోదైంది. అంతకుముందు నెల మార్చిలోనూ 3.8 శాతంగా ఉండగా, ఈసారి ఇది మరింత క్షీణించింది. ఇక నిరుడు ఏప్రిల్‌లో 6.5 శాతంగా ఉన్న వృద్ధిరేటు కాస్తా తాజాగా 3.1 శాతానికి దిగజారింది. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాల ద్వారా స్పష్టమవుతోంది. పారిశ్రామికోత్పత్తిలో 77.63 శాతం వాటా కలిగిన ఉత్పాదక రంగం వృద్ధిరేటు ఈ ఏప్రిల్‌లో 2.6 శాతంగా ఉంటే, నిరుడు 5.5 శాతంగా ఉంది. అలాగే గనుల రంగంలో ఈసారి 4.2 శాతంగా, పోయినసారి 6.7 శాతంగా ఉంది. విద్యుత్ రంగ వృద్ధిరేటు సైతం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 5.4 శాతానికే పరిమితమైంది. నిరుడు ఏప్రిల్ నెలలో 14.4 శాతంగా ఉందని సిఎస్‌ఒ తెలియజేసింది. ఇక దేశీయ పెట్టుబడులకు ప్రామాణికమైన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా మైనస్ 1.3 శాతానికి పతనమైంది. నిరుడు దీన వృద్ధిరేటు 8.1 శాతంగా ఉంది. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి కూడా గతంతో పోల్చితే 13.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. కాగా, ఐఐపి పతనమైన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లను తగ్గించాలని భారతీయ వ్యాపార, పారిశ్రామిక సంఘాలు డిమాండ్ చేశాయ. ఇటీవలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ యథాతథంగా ఉంచిందని, కాబట్టి తాజా గణాంకాల దృష్ట్యా వడ్డీరేట్ల తగ్గింపుపై దృష్టి పెట్టాలని అసోచామ్ పేర్కొంది.