బిజినెస్

మొండి బకాయిల సమస్యను పరిష్కరిస్తాం: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తీవ్రంగా కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమయ్యారు. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికీ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు దేశీయ రెండో అతిపెద్ద ఐటిరంగ సంస్థ సారథి, ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా జైట్లీని కలిశారు. అమెరికా వీసా నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు.
జైట్లీని కలిసిన టిఆర్‌ఎస్ ఎంపీలు
మరోవైపు తెలంగాణ రాష్ట్ర జిడిపి ప్రకారం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని అరుణ్ జైట్లీకి టిఆర్‌ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సోమవారం జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్‌లు జైట్లీతో సమావేశం అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత మూడేళ్ల కాలంలో అభివృద్దిలో ముందుకు వెళ్తున్నందున ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులనూ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.