బిజినెస్

త్వరలో కొత్త రూ. 500 నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూన్ 13: ఆర్‌బిఐ త్వరలో నూతన 500 రూపాయల నోట్లను జారీ చేయనుంది. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లో ఈ బ్యాంక్ నోట్లు విడుదల కానున్నాయి. ‘ఎ’ ఇన్‌సెట్ లెటర్‌తో, ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఇవి రానున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. రద్దయిన 1,000, 500 రూపాయల నోట్ల స్థానంలో కొత్త 2,000, 500 రూపాయల నోట్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించగా, పాత పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందాలని ప్రజలకు మోదీ సూచించారు. ఈ క్రమంలో నకిలీ నోట్లకు తావులేకుండా మరింత ప్రభావవంతమైన భద్రతా ప్రమాణాలతో కొత్త కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ చలామణిలోకి తెస్తోంది.
మొత్తం మొండి బకాయిల్లో
ఆ పనె్నండింటి విలువే 25 శాతం
ఆర్‌బిఐ మంగళవారం 5,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన 12 మొండి ఖాతాలను గుర్తించింది. ఈ ఖాతాల్లోని నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) విలువ మొత్తం బ్యాంకుల మొండి బకాయిల్లో 25 శాతానికి సమానంగా ఉండటం గమనార్హం.
కాగా, వీటిని దివాళా చట్టం క్రింద తీర్మానించడం కోసం తక్షణమే సిఫార్సు చేయాలని బ్యాంకర్లకు ఆర్‌బిఐ సూచించింది. బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్నది తెలిసిందే. దేశంలోని బ్యాంకులకు 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన మొండి బకాయిలుండగా, అందులో 6 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఈ క్రమంలోనే ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇందులోభాగంగానే బ్యాంకుల విలీనానికి దిగుతున్నది తెలిసిందే. ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడి, మరో బ్యాంకుకు రుణం కోసం వెళ్తుండటాన్ని బ్యాంకుల విలీనంతో అరికట్టవచ్చన్నది మోదీ సర్కారు విశ్వాసం.
కాగా, ఈ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మరింత తగ్గవచ్చని, తద్వారా ఆగస్టు ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ 25 శాతం మేర తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అభిప్రాయపడింది.