బిజినెస్

భారతీయ మార్కెట్‌లోకి నయా నోకియా స్మార్ట్ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: భారతీయ మార్కెట్‌లోకి స్మార్ట్ఫోన్ల రూపంలో సరికొత్తగా ప్రవేశించింది నోకియా. హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ద్వారా నోకియా బ్రాండ్.. మళ్లీ విపణిలోకి అడుగిడింది. నోకియా 3, 5, 6 మోడళ్లను మంగళవారం న్యూఢిల్లీలో ఆ విష్కరించారు. జూన్ 16 నుంచి నోకియా 3 మోడల్ అందుబాటులో ఉంటుందని హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ప్రతినిధులు తెలిపారు. జూలై 7 నుంచి నోకియా 5 మోడల్ ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయన్నారు. నోకియా 3 ధర 9,499 రూపాయలైతే, నోకియా 5 ధర 12,899 రూపాయలని చెప్పారు. రిటైల్ స్టోర్లలో మాత్రమే ఇవి లభించనున్నాయ. కాగా, నోకియా 6 మోడల్ ప్రీ-బుకింగ్స్ జూలై 14 నుంచి ప్రారంభమవుతాయని, దీని ధర 14,999 రూపాయలని పేర్కొన్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌పై కొనుగోలు చేయవచ్చన్నారు. సామ్‌సంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్లకు పోటీగా వీటిని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పెక్కా, హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ఉపాధ్యక్షుడు (్భరత్) అజయ్ మెహతా తెలిపారు. అంతర్జాతీయ స్థాయలో నోకియా మొబైల్స్ మార్కెటింగ్ హక్కులను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ దక్కించుకున్నది తెలిసిందే.