బిజినెస్

మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 7.79 పాయింట్ల లాభంతో 31,103.49 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.50 పాయింట్లు నష్టపోయి 9,606.90 వద్ద స్థిరపడింది. రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు చాలావరకు లాభాల్లోనే ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం లాభాల్లోనే కదలాడాయి. ఇదిలావుంటే మంగళవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)ను దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అధిగమించింది. ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ 4,26,783.30 కోట్ల రూపాయలుగా ఉంటే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ 4,31,471.57 కోట్ల రూపాయలుగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ విలువ 0.62 శాతం పెరిగి 1,679.65 వద్ద ముగియగా, ఆర్‌ఐఎల్ షేర్ విలువ 0.51 శాతం పడిపోయి 1,312.60 వద్ద నిలిచింది. మరోవైపు 4,83,424.79 కోట్ల రూపాయలతో దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ మొదటి స్థానంలో ఉంది.