బిజినెస్

సింగరేణిలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 14: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ సంస్థలో వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నుంచి సమ్మె కొనసాగనుంది. సమ్మె కారణంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని సింగరేణిలో ఉన్న సుమారు 60 వేల మంది కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. సింగరేణి కార్మికుల సమ్మెతో 16 ఓపెన్‌కాస్ట్‌లు, 36 భూగర్భ బావుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు విప్లవ కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సింగరేణి వ్యాప్తంగా జరిగే సమ్మెను నీరుగార్చేందుకు సింగరేణిలో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికెఎస్), సింగరేణి యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయ ని కార్మికులు అంటున్నారు. అయతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అతిపెద్ద సంస్థ సింగరేణిలో సమ్మె కొనసాగటం ఇదే మొదటిసారి కానుండటంతో జాతీయ కార్మిక సంఘాలు సవాల్‌గా తీసుకుని సమ్మె ను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నాయి. సమ్మె కారణంగా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. సమ్మెను నివారించేందుకు సింగరేణి యాజమాన్యం, రీజనల్ లేబర్ కమిషనర్‌లు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన నేపథ్యంలో సమ్మె అనివార్య మైంది.
సమ్మె.. చట్ట విరుద్దం: సింగరేణి
హైదరాబాద్: వారసత్వ ఉద్యోగాలపై కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కాలేదని, ఈ నెల 23వ తేదీకి వాయిదా మాత్రమే పడ్డాయని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ దశలో సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధమవుతున్నందున, తక్షణం విధుల్లో చేరాలని యాజమాన్యం కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేసింది. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడేందుకు 19 వరకు సమయం కావాలని కోరడం జరిగిందని తెలిపారు. అంతేగాని చర్చలు విఫలం కాలేదని సింగరేణి ఫైనాన్స్, పర్సనల్ విభాగం డైరక్టర్ జె పవిత్రన్ ఆ ప్రకటనలో తెలిపారు. కార్మిక శాఖ అధికారి ఎక్కడా చర్చలు విఫలమైనట్లు ప్రకటించలేదని, 23కి వాయిదా వేసినట్లు మాత్ర మే నోటీసిచ్చారని వివరించారు.