బిజినెస్

ఎన్‌పిఎలుగా టెల్కోల బకాయిలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: దేశీయ టెలికామ్ రంగం ఒత్తిడికి గురవుతోందని, ఆయా టెలికామ్ సంస్థలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)గా మారే ప్రమాదం కనిపిస్తోందని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ ఇంటర్-మినిస్టీరియల్ గ్రూప్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయా బ్యాంకర్లు మాట్లాడుతూ టెలికామ్ ఆపరేటర్లు డిఫాల్టర్లుగా తయరయ్యే సంకేతాలున్నాయని అన్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గుర్తించిన 12 మంది భారీ డిఫాల్టర్ల పేర్లను త్వరలోనే బహీర్గతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఇక్కడ తెలిపింది. ఈ 12 మంది తీసుకున్న రుణాల విలువ మొత్తం బ్యాంకింగ్ రంగ మొండి బకాయిల్లో 25 శాతంగా ఉన్నట్లు ఆర్‌బిఐ మంగళవారం ప్రకటించినది తెలిసిందే. కాగా, ఈ డిఫాల్టర్లను తక్షణమే దివాళా చట్టం క్రింద తీర్మానించాలన్న ఆర్‌బిఐ నిర్ణయాన్ని బ్యాంకర్లు స్వాగతించారు. మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకులను, బీమా సంస్థలను ఆదుకోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్ పార్లమెంట్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది. ఇదిలావుంటే నకిలీ నోట్లు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 3,53,837కు పెరిగాయని ఓ నివేదికలో వెల్లడైంది. 2007-08లో ఇవి కేవలం 8,580 నోట్లు మాత్రమే ఉన్నాయంది. తాజా నివేదిక పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి బలం చేకూరుస్తోందని కేంద్రం అభిప్రాయపడుతోంది.