బిజినెస్

ఏపిలో అజూర్ పవర్ సోలార్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: ఆంధ్రప్రదేశ్‌లో అజూర్ పవర్ 100 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు అజూర్ పవర్ తెలిపింది. 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వద్ద తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్న అజూర్ పవర్.. ఈ సోలార్ పార్కును సోలార్ పార్క్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు అభివృద్ధి చేశాయని పేర్కొంది.