బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 80.18 పాయింట్లు దిగజారి 31,075.73 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 40.10 పాయింట్లు పడిపోయి 9,578.05 వద్ద నిలిచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ఇది ఊహించినట్లుగానే ఉన్నప్పటికీ, తమ బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించుకునే దిశగా వెళ్తామన్న ఫెడ్ రిజర్వ్ ప్రకటన.. భారతీయ మార్కెట్ల లాభాలను అడ్డుకుంది. కాగా, చమురు, గ్యాస్, పిఎస్‌యు, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, చైనా సూచీ మాత్రం లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.