బిజినెస్

సమ్మె.. సింగరేణికి కలిసొస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూన్ 17: వారసత్వ ఉద్యోగాల సాధనే ధ్యేయంగా కార్మికులకు, సింగరేణి సంస్థకు మధ్య జరుగుతున్న పోరు నేపథ్యంలో యాజమాన్యం ప్రకటనలు.. సింగరేణి అభివృద్ధికి కార్మికులే ఆటంకాలా? అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయ.
గత మూడు రోజులుగా సింగరేణి బొగ్గు పరిశ్రమలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె కారణంగా కార్మికులు విధులకు హాజరు కాకున్నా.. సంస్థ ఉత్పత్తి గతం కంటే గణనీయంగా జరుగుతోందని చెబుతున్న అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది మరి. ఈ లెక్కన సమ్మె వల్లే సింగరేణికి కలిసొస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి పూర్తిగా తప్పుడు లెక్కలని, సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగానే యాజమాన్యం ఉత్పత్తి వివరాలను తప్పుడుగా చూపిస్తోందని జాతీయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన సింగరేణి వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె ప్రారంభమైంది.
ఈ క్రమంలో 14వ తేదీన 1,57,543 టన్నుల ఉత్పత్తి అయందని, అయితే సమ్మె ప్రారంభించిన మొదటి రోజు 1,72,261 టన్నులు, రెండవ రోజు 1,76,197 టన్నులను వెలికి తీశామని అదీగాక రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించినట్లు యాజమాన్యం ప్రకటన చేయడం గమనార్హం.
ఉత్పత్తిలోనే కాకుండా రవాణాలో కూడా ప్రత్యేక రికార్డులను సొంతం చేసుకున్నట్లు ఏకంగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టరే ప్రకటించారు. మొత్తానికి బొగ్గు పరిశ్రమలో వారసత్వ ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించి తీరాలని, ఇందుకు సమ్మెనే ఏకైక మార్గమని భావించిన జాతీయ కార్మిక సంఘాలు ఉప్పెనలా ముందుకు సాగుతుంటే.. ఈ సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తూ, విధులకు హాజరయ్యే కార్మికులకు సపర్యలు చేసేందుకు రోజూ కొన్ని లక్షల రూపాయలను దుబారా చేస్తోందని కార్మిక సంఘాలు గొంతెత్తి ఆరోపిస్తున్నాయి.