బిజినెస్

రూ. 10 వేల కోట్లు చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: బ్రిటన్‌కు చెందిన చమురు రంగ దిగ్గజం.. కెయిర్న్ ఎనర్జీని 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ముందుకు వెళ్లి కెయిర్న్ ఎనర్జీ భంగపాటుకు గురైన నేపథ్యంలో 10,247 కోట్ల రూపాయల రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వసూలుకు ఐటి శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే పై ఆదేశాలను ఇచ్చింది. అలాగే కెయిర్న్ ఎనర్జీ అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియా (ప్రస్తుతం వేదాంత లిమిటెడ్) నుంచి 104 మిలియన్ డాలర్ల డివిడెండ్ బకాయిలను, మరో 1,500 కోట్ల రూపాయల ట్యాక్స్ రిఫండ్‌ను వసూలు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కెయిర్న్ ఇండియాలో కెయిర్న్ ఎనర్జీకి ఉన్న 9.8 శాతం వాటాను ఆదాయ పన్ను శాఖ హస్తగతం చేసుకోనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఆదాయ పన్ను శాఖ నుంచి పన్ను నోటీసులను అందుకున్నట్లు కెయిర్న్ ఎనర్జీ కూడా ఓ ఈ-మెయిల్ ప్రకటనలో స్పష్టం చేసింది.