బిజినెస్

విద్యుత్ ఉపకరణాలపై పెనుభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: విద్యుత్ ఉపకరణాలపై 28 శాతం వరకు జిఎస్‌టి విధించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ పొదుపు కోసం కోట్లాది రూపాయల సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఎల్‌ఇడి బల్బులపై సైతం అధిక పన్ను విధింపు ఆశ్చర్యం గొలుపుతున్నది. పన్నుల భారం వల్ల ప్రభుత్వాలకు ఆశించిన ఆదాయం రాకపోగా పన్ను ఎగవేతకు.. అధికారులు, సిబ్బంది అవినీతికి జిఎస్‌టి దోహదపడుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతి డీలర్, ప్రతి వ్యాపారి సాలీనా తమ తమ వ్యాపార టర్నోవర్లపై కనీసం 39 ఫారాలను పూర్తిచేయాల్సి ఉంది. సామాన్యుడు వాడుకునే బల్బులు, ట్యూబ్‌లైట్లు, వాటి ఫిటింగ్‌లు, ఉపకరణాలపై గతంలో ఐదు శాతం వరకు ఉన్న పన్నును జిఎస్‌టిలో 28 శాతం వరకు పెంచారు. వైర్లు, కేబుల్స్‌పైనా పన్నును 28 శాతానికి పెంచారు. ఇక వెయ్యి రూపాయల ఫ్యాన్‌కు 1,280 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్‌టి ఏకీకృత పన్ను విధానం గందరగోళంగా ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాన్య గృహిణిపై కూడా జిఎస్‌టి భారం పడనుంది. సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లు ఇలా ప్యాకింగ్ కలిగిన అన్నిరకాల వంటింటి వస్తువులపై పన్ను భారం పడనుంది. టెలిఫోన్, మొబైల్స్, బీమాపై సర్వీస్ టాక్స్ పెరుగుతుంది. ఏదిఏమైనా ప్రతి సామాన్య, మధ్యతరగతి కుటుంబం నెలకు కనీసం 4 వేల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. చిరు వ్యాపారులకు మాత్రం కొంత వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.
20 లక్షల రూపాయల లోపు టర్నోవర్ చేసేవారికి పన్ను భారం ఉండదు. 20 నుంచి 70 లక్షల రూపాయల టర్నోవర్ చేసేవారు కాంపోజిట్ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. పొగాకు ముడిసరుకుపై 5 శాతం జిఎస్‌టి విధించారు. దానివల్ల వ్యాపారులు పొగాకు కొనుగోలు సమయంలో రైతుల నుంచి ఆ పన్ను వసూలు చేస్తారు. మొత్తానికి జిఎస్‌టి వల్ల అనేక సమస్యలని వ్యాపారులు వాపోతున్నారు.