బిజినెస్

మూడు రోజులు వస్త్ర వ్యాపారం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుందని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్స్ (టిఎస్‌ఎఫ్‌టిఎ) అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్ పేర్కొన్నారు. వస్త్ర వ్యాపారాన్ని జిఎస్‌టి నుండి ఉపసంహరించాలని డిమాం డ్ చేస్తూ మూడు రోజుల బంద్‌ను పాటిస్తున్నారు. తొలిరోజైన మంగళవారం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల్లోనూ వస్త్ర దుకాణాలను బంద్ చేశారు. క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, హోల్‌సేల్, కట్‌పీస్ మర్చంట్స్ అసోసియేషన్ తదితర సంఘాలు ఆందోళనలో పాల్గొంటుండటంతో రోజు కళకళలాడే సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్, వస్తబ్రజార్, మహంకాళి దేవాలయం ప్రాంతం, పాతనగరంలోని మదీనా, చార్మినార్, హైదరాబాద్‌లోని కోఠి, అబిడ్స్, అమీర్‌పేట తదితర ప్రాంతాలు బోసిపోయాయ. శుక్రవారం బంద్‌తోపాటు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకాశ్ ప్రకటించారు.