బిజినెస్

జిఎస్‌టి మినహాయింపునకు ప్రయత్నిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: వస్త్ర పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, బీడి పరిశ్రమకు సంబంధించి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అలాగే బ్యాంకు లావాదేవీలపై విధిస్తున్న రెండు శాతం సేవా పన్నునూ జైట్లీ దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. జిఎస్‌టి వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై వస్త్ర వ్యాపారులు ఆదివారం దత్తాత్రేయను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ జిఎస్‌టి విజయవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిఎస్‌టికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని, వాటిని తాను కేంద్రానికి విన్నవిస్తానని ఆయన చెప్పారు. కాగా, పాత జిల్లాలైన నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డిల్లో ఒక్కో జిల్లాకు 130 కోట్ల రూపాయల చొప్పున, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు 200 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు.
నేడు ఆర్‌బిఐ నిధుల విడుదల
రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలంగాణ బ్యాంకర్లకు 1,700 కోట్ల రూపాయల నిధులను సోమవారం విడుదల చేయనున్నదని దత్తాత్రేయ తెలిపారు. రైతులకు ఖరీఫ్ రుణాలు సక్రమంగా అందడం లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఆర్‌బిఐ అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా, వెంటనే స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.
అమలుకు సిద్ధం: ఆంధ్రా బ్యాంక్
మరోవైపు జిఎస్‌టి ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో పూర్తి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంకు వెల్లడించింది. ఇతర వివరాలను బ్యాంకు వెబ్‌సైట్‌లో, బ్యాంకు బ్రాంచ్‌ల్లోనూ అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రా బ్యాంకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

చిత్రం.. మంత్రి దత్తాత్రేయకు వినతి పత్రం అందజేస్తున్న వస్త్ర వ్యాపారులు