బిజినెస్

వాహన ధరలను తగ్గించిన హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. వాహన ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చేకూరిన ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశ్యంతో వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 400 రూపాయల నుంచి గరిష్ఠంగా 1,800 రూపాయల వరకు ధరలను తగ్గించింది హీరో మోటోకార్ప్. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా, మారుతి సుజుకి, టొయోట కిర్లోస్కర్, జాగ్వార్ లాండ్‌రోవర్, బిఎమ్‌డబ్ల్యు సైతం శనివారం తమ కార్ల ధరలను తగ్గించినది తెలిసిందే. వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 2,300 రూపాయలు, గరిష్ఠంగా 2 లక్షల రూపాయలకుపైగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. టొయోట ఫార్చూనర్ ధర అత్యధికంగా 2.17 లక్షల రూపాయలు తగ్గింది. క్రిస్టా ధరనూ 98,500 రూపాయలు, కరోల్లా ఆల్టిస్ ధరను 92,500 రూపాయలు దించింది. అయితే టొయోట కామ్రి, ప్రియస్ ధరను 3.5-5.24 లక్షల రూపాయలకుపైగా పెంచింది. బి ఎమ్‌డబ్ల్యు కూడా ఎక్స్1 ధరను 70,000 రూపాయలు, సెడాన్ 7 సిరీస్ ధరను 1.8 లక్షల రూపాయలు తగ్గించింది. అయితే ఐ8 ధరను 4.8 లక్షల రూపాయలు పెంచింది. టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ కూడా వివిధ మోడళ్లపై ధరలను తగ్గించింది.