బిజినెస్

సునీల్ మిట్టల్ వార్షిక వేతనం రూ. 30 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 30 కోట్ల రూపాయలకుపైగా వార్షిక వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది 8 శాతం అధికం. నాడు 27.8 కోట్ల రూపాయల జీతాన్ని మిట్టల్ తీసుకున్నారు.
కాగా, 2016-17లో 20.13 కోట్ల రూపాయలు జీతం, ఇతరత్రా అలవెన్సులుండగా, పనితీరు ఆధారిత ప్రోత్సాహకం 9 కోట్ల రూపాయలుగా ఉంది. మరో కోటి రూపాయలు పెర్క్స్ ఉన్నాయి. ఐదేళ్లకుగాను సంస్థ చైర్మన్‌గా నిరుడు మిట్టల్ మరోసారి ఎన్నికయ్యారు.