బిజినెస్

జిఎస్‌టి అమలుపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఎలా? ఉందన్న దానిపై మదుపరులు దృష్టి పెట్టవచ్చని, దాని ఆధారంగానే ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులను తీసుకువచ్చే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిదుడుకులకు అవకాశం కూడా లేకపో లేదన్నారు. కాగా, స్థూల ఆర్థిక గణాంకాల ప్రకటన కూడా ఉండటంతో ట్రేడింగ్‌ను ఇవి కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వర్ష సమాచారమూ కీలకమేనని చెబుతున్నారు. అయతే శనివారం నుంచి దేశవ్యా ప్తంగా అమల్లోకి వచ్చిన పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)పైనే ఈ వారం ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్ల తీరు ఆధారపడి ఉందని స్పష్టం చేస్తున్నా రు. 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం.. జిఎస్‌టిలో పన్ను రేట్లను నిర్ణయంచినది తెలిసిందే. అయతే అధిక పన్ను విధించారన్న భావనలో ఉన్న పలు రంగాలు తమపై పన్నుల భారాన్ని తగ్గించాలని ఆందోళన బాట పట్టాయ. దీంతో వీటన్నిటి ప్రభావం మదుపరుల పెట్టుబడులపై ఉంటుందంటున్నారు మార్కెట్ విశే్లషకులు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 216.60 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 54.05 పాయంట్లు పడిపోయాయ. సెనె్సక్స్ 30,921 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,520 వద్ద నిలిచింది. మరోవైపు జూన్ నెలకుగాను అమ్మకాల వివరాలను ఆటో రంగ సంస్థలు వెల్లడిస్తుండటంతో దాని ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని నిపుణు లు చెబుతున్నారు. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.