బిజినెస్

దొనకొండలో టైటాన్ ఏవియేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, జూలై 3: ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఉక్రెయిన్‌కు చెందిన టైటాన్ ఏవియేషన్ సంస్థ త్వరలో విమానాల తయారీ, మరమ్మతులు, శిక్షణ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికి 26 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ సిఎండి గిరికుమార్ తెలిపారు. సోమవారం టైటాన్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధుల బృందం మండలంలోని మల్లంపేట, కొచ్చర్లకోట, మంగినపూడి ప్రాంతాల్లో కేటాయించిన 5 వేల ఎకరాల భూమికి చుట్టూ హద్దులను పరిశీలించారు. ఆ భూమికి సంబంధించి మార్కింగ్ చేసుకున్నారు. ఆ భూముల వివరాలు, గ్రామాలు, రహదారులు మ్యాప్‌ల ద్వారా తనిఖీ చేసుకున్నారు. ఈ భూమిలో 7 కిలోమీటర్ల మేర రన్‌వే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సంస్థకు సంబంధించి ఈ ప్రాంతానికి చెందినవారికి 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. త్వరలో ఈ 5 వేల ఎకరాల చుట్టూ తమ కంపెనీ.. ప్రభుత్వ అనుమతితో కంచె నిర్మాణం చేపడుతుందని బృంద సభ్యులు తెలిపారు. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు సామగ్రిని త్వరలో సమకూర్చుకోనున్నట్లు, కంపెనీకి సంబంధించిన వౌలిక వసతుల గురించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. అతిత్వరలో కంపెనీని ప్రారంభిస్తామని చెప్పారు. భూములను పరిశీలించిన వారిలో సంస్థ డైరెక్టర్ శ్రీధర్, వైస్ ప్రెసిడెంటు చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ అసాద్‌తోపాటు తహశీల్దార్ కె వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రాజేష్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ రాజశేఖర్, ఇంజనీర్ కుమార్, సర్వేయర్ వెంకటరావులున్నారు. వౌలిక వసతులు, భౌగోళిక పరిస్థితులను అధికారులు.. సంస్థ ప్రతినిధులకు వివరించారు.

చిత్రం.. దొనకొండలో భూములను పరిశీలిస్తున్న ఉక్రెయిన్ ఏవియేషన్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం