బిజినెస్

జిఎస్‌టి తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 3: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మదుపరుల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఉత్సాహం కనిపించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 300.01 పాయింట్లు ఎగబాకి 31,221.62 వద్ద స్థిరపడగా, గడచిన నెల రోజుల్లో కేవలం ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 94.10 పాయింట్లు ఎగిసి 9,615 వద్ద నిలిచింది.
ఎఫ్‌ఎమ్‌సిజి, టెలికామ్, మెటల్, రియల్టీ, ఆటో, ఇండస్ట్రియల్స్, టెక్నాలజీ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఒకానొక దశలోనైతే సెనె్సక్స్ 31,258.33 పాయింట్లు, నిఫ్టీ 9,624 పాయింట్ల స్థాయిని అందుకున్నాయి. కాగా, ఆయా రంగాల షేర్ల విలువ సోమవారం ట్రేడింగ్‌లో 3.40 శాతం నుంచి 0.86 శాతం మేర పెరిగింది. ఐటిసి షేర్ విలువైతే 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 5.70 శాతం లాభపడింది. జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, జిడిపి పరుగులు పెట్టడమేగాక, క్రెడిట్ రేటింగ్ కూడా పెరుగుతుందన్న అంచనాలు అటు దేశీయ మదుపరులు, ఇటు విదేశీ మదుపరుల్లో నూతనోత్తేజాన్ని కలిగించింది. ఇకపోతే అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ సూచీలు 0.02 శాతం నుంచి 0.17 శాతం మేర లాభపడ్డాయి.
మరోవైపు ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాభాల్లోనే కదలాడాయి. ఇది భారతీయ మార్కెట్ల లాభాలకూ దోహదపడింది.