బిజినెస్

ధరలను తగ్గిస్తున్న ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. జిఎస్‌టి ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తూ హెచ్‌యుఎల్‌తోపాటు పతంజలి, ఐటిసి, మారికో వంటి సంస్థలు తమ ఉత్పత్తుల రేట్లలో మార్పులు తెస్తున్నాయి. పన్ను పెరిగిన చోట ఆయా ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి కూడా.
సంస్కరణల అమల్లో
భారత్ భేష్: ఎఫ్‌ఎస్‌బి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంఘం.. ఆర్థిక సుస్థిరత బోర్డు (ఎఫ్‌ఎస్‌బి) సోమవారం విడుదల చేసిన సంస్కరణల నివేదికలో భారత్ మంచి స్థానాన్ని పొందింది. సంస్కరణల అమల్లో భారత్ భేష్ అని, బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని సంస్కరిస్తోందని కొనియాడింది. త్వరలో జర్మనీలో జి20 సదస్సు జరగనున్న క్రమంలో తాజా నివేదిక భారత్‌కు కలిసిరానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ జి20 సదస్సుకు హాజరవుతారు.