బిజినెస్

తెలంగాణ బ్యాంకుల్లో నగదు కొరత తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు.
సోమవారం ఇక్కడ దత్తాత్రేయ, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వి శ్రీరామ్.. అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. అనంతరం దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ బ్యాంకు ల్లో నగదు లేకపోవడంవల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి తక్షణమే కొంత నగదును బ్యాంకుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్టు దత్తాత్రేయ తెలిపారు. అలాగే బీడీ పరిశ్రమను 28 శాతం పన్నుల శ్లాబ్‌లో ఉంచడం వల్ల తెలంగాణలోని బీడీ కార్మికులు ఆందోళనలో ఉన్నారని కూడా ఆర్థిక మంత్రికి వివరించానన్నారు.
కాగా, మహారాష్ట్ర నుంచి సిద్దిపేటకు వలస వచ్చిన మోతీరామ్ చవాన్ సత్తవ, ఆయన భార్య గంగాభాయ్, మనవడు ఓంకార్‌లకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై దత్తాత్రేయ స్పందించారు. వారికి ఆధార్, రేషన్ కార్డులను మంజూరు చేయాలని స్థానిక అధికారులకు దత్తాత్రేయ సూచించారు.

చిత్రం.. సోమవారం ఢిల్లీలో అరుణ్ జైట్లీతో బండారు దత్తాత్రేయ