బిజినెస్

ఈ ఏడాది ఐటి రంగం ఆశాజనకంగా ఉండకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: ఈ ఏడాది భారత ఐటి రంగంలో వృద్ధిరేటు మందగించే అవకాశాలు ఉన్నాయని, గత ఎనిమిదేళ్లలో నమోదు చేసుకున్న అభివృద్ధి కన్నా తక్కువగా ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది. ఆటోమేషన్‌తోపాటు క్లైంట్లు కొత్త రంగాలకు మారడం, సంప్రదాయేతర పద్ధతుల్లో ఐటి సేవలు తదితరమైన కారణాల వల్ల ఐటి రంగంలో వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ పేర్కొంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) సంస్ధ భారతీయ ఐటి రంగంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది దేశీయ ఐటి ఎగుమతుల వృద్ధిరేటు 10-11 శాతం, ఎగుమతుల రెవెన్యూ 7 నుంచి 8 శాతం ఉంటుందని అంచనా. భారతీయ ఐటి రంగం మార్కెట్ సైజు 117 బిలియన్ డాలర్లు. మరోవైపు ఈ ఏడాది 1.5 లక్షల మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు ఉన్నాయని నాస్కామ్ పేర్కొంది. నిరుడు 1.7 లక్షల మందికి ఐటి రంగంలో ఉద్యోగావకాశాలు లభించాయి. ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచాలని, దీనివల్ల ఐటి రంగంలో అభివృద్ధి పెరుగుతుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కూడా దేశీయ ఐటి రంగ అభివృద్ధి మందగించే అవకాశాల్లో ఒక కారణమన్నారు.