బిజినెస్

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 11.83 పాయింట్లు పడిపోయి 31,209.79 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.70 పాయింట్లు కోల్పోయి 9,613.30 వద్ద నిలిచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఉత్సాహంతో సోమవారం సెనె్సక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల మేర లాభాలను అందుకున్నది తెలిసిందే. మంగళవారం ఉదయం ఆరంభంలోనూ సూచీలు లాభాల్లోనే కదలాడాయి. సెనె్సక్స్ 132, నిఫ్టీ 36 పాయింట్ల మేర లాభపడ్డాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ప్రభుత్వ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) బుధవారం విదేశీ మదుపరులకు ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. 16,758 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను విక్రయించనుంది. రోజువారి సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులకున్న పరిమితిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం పెంచింది. 1,87,700 కోట్ల రూపాయలకు పెంచింది. ఇంతకుముందు 1.85 లక్షల కోట్ల రూపాయల వరకే ఉంది. సెబీ తాజా నిర్ణయంతో భారతీయ మార్కెట్లలోకి మరిన్ని విదేశీ పెట్టుబడుల రాకకు అవకాశం ఏర్పడింది.