బిజినెస్

4జి వేగంలో జియోనే టాప్: ట్రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: రిలయన్స్ జియో.. గత నెల జూన్‌లోనూ 4జి మొబైల్ వేగంలో ఇతర అన్ని టెలికామ్ ఆపరేటర్ల కంటే ముందుంది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం జియో డౌన్‌లోడ్ వేగం సెకనుకు 18.8 మెగాబైట్లుగా ఉంది. అయితే మేలో ఇది 19.12 మెగాబైట్లుగా ఉండగా, జూన్‌లో కాస్త తగ్గింది. అయినప్పటికీ 4జి స్పీడ్‌లో జియోనే టాప్ అని ట్రాయ్ మంగళవారం స్పష్టం చేసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన 4జి టెలికామ్ సేవల సంస్థ.. నిరుడు సెప్టెంబర్‌లో ప్రారంభమైనది తెలిసిందే.