బిజినెస్

సింగరేణి జెవిఆర్ ఓసి-2 ప్రాజెక్టుకు 776.20 హెక్టార్ల భూమి అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన జెవిఆర్ ఒసి 2 బొగ్గు తవ్వకం ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 776.20 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిని మళ్లించే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఖమ్మం అటవీ డివిజన్‌లోని లంకపల్లి రిజర్వు ఫారెస్టు భూమిలో సింగరేణి సంస్థకు జెవిఆర్ ఒసి 2 బొగ్గు తవ్వకం ప్రాజెక్టుకు మళ్లించే అటవీ, పర్యావరణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని అనుసరించి అన్ని నియమ పలు నిబంధనలను పాటించాలని సూచిస్తూ ప్రభుత్వం ఈ భూమిని మళ్లించేందుకు అంగీకరించింది. ముఖ్యంగా బదలాయించిన భూమిపై ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన హోదా అలాగే కొనసాగేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రాజెక్టు పని చేపట్టే ముందే సింగరేణి సంస్థ పర్యావరణ అనుమతిని పొందాల్సి ఉందని పేర్కొంది. భూమి ఏ అవసరానికి తీసుకుంటున్నారో, ఆ అవసరం తప్ప ఆ ప్రాంతంలో మరే ఇతర కార్యకలాపాలు నిర్వహించరాదని, అటవీ సంరక్షణ చట్టాన్ని ఎట్టిపరిస్థితిలోనూ ఉల్లంఘించరాదని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు చాలా ఆంక్షలను భూమిని వినియోగించుకునే ఏజెన్సీ అయిన సింగరేణి కాలరీస్‌కు తెలియజేస్తూ భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.