బిజినెస్

అమెజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ గత రెండు నెలల్లో అదనంగా రూ. 2 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కుమ్మరించింది. భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో 500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని గతంలో అమెజాన్ ఇచ్చిన హామీలో భాగంగా ఆ సంస్థ ఈ తాజా పెట్టుబడులు పెట్టింది. భారత మార్కెట్‌లో ఆధిపత్యం కోసం స్థానిక ప్రత్యర్థి ‘్ఫ్లప్‌కార్ట్’తో తీవ్రస్థాయిలో పోటీపడుతున్న అమెజాన్‌కు ఈ పెట్టుబడులతో మరింత ఊతం లభించినట్లయింది. గత నెలలో తమకు ఈ అదనపు పెట్టుబడులు అందాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ (అమెజాన్ ఇండియా) తెలియజేసింది. భారత్‌లోని వినియోగదారులకు ఇ-కామర్స్‌ను అలవాటుగా మార్చాలన్న దీర్ఘకాలిక ఆలోచనతో తమ కార్యకలాపాలను విస్తరించి వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు, ఇందుకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం, వౌలిక వసతుల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టి ఈ వ్యవస్థను మరింత ముందుకు నడిపేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. భారత్‌లో 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని గతంలో గతంలో పేర్కొన్న అమెజాన్, వీటికి అదనంగా మరో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని గత ఏడాది జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో అమెజాన్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమై ఇటీవలే నాలుగేళ్లు పూర్తయింది. భారత్‌లో తమ వౌలిక వసతుల విస్తరణతో పాటు వినియోగదారులు, వ్యాపారుల్లో సంతోషాన్ని పెంపొందించే చర్యలను చేపట్టేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తామని ఆ సంస్థ పేర్కొంది. అమెజాన్ వ్యాపార విస్తరణలో భారత మార్కెట్‌కు గల ప్రాధాన్యతను ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇప్పటికే గుర్తించారు. కాగా, భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో అమెజాన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపార విస్తరణ కోసం ఈ ఏడాది ఆరంభంలో 140 కోట్ల డాలర్ల నిధులను సమీకరించుకుంది. దీంతో ఈ రెండు సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు రాబోయే పండుగల సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.