బిజినెస్

పారదర్శక పన్నుల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, జూలై 6: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశం ఇప్పుడు ఆథునికమైన, పారదర్శకమైన సుస్థిరమైన, ముందుగా ఊహించదగిన పన్నుల విదానం దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురువారం ఇక్కడ భారత్-ఇజ్రాయెల్ సిఈఓల ఫోరం సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం భారత్‌ను ఒక తయారీ కేంద్రంగా చేయడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. కాగా గురువారం తొలిసారిగా సమావేశమైన భారత్-ఇజ్రాయెల్ సిఈఓ ఫోరం ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రానున్న అయిదేళ్లలో 20 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది.‘జిఎస్‌టి భారత్‌లో ఇంతవరకు తీసుకున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఇప్పుడు మేము పారదర్శకమైన, సుస్థిరమైన, ముందుగా ఊహించదగ్గ ఆధునిక పన్నుల విధానం దిశగా ముందుకు సాగుతోంది’ అని మోదీ చెప్పారు. తన పర్యటన నేపథ్యంలో కుదుర్చుకున్న 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలతో ఇప్పుడు ఇరుదేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని ఆయన చెప్పారు. ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి అవకాశాలను సృష్టించడమే దీనికి చోదక శక్తి అని ఆయన అన్నారు. వాణిజ్య సంస్థలు, కంపెనీలు ఎదుర్కొంటున్న రెగ్యులేటరీ, విధానపరమైన పలు సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని, సులభతర వాణిజ్యం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వం భారత దేశాన్ని తయారీ కేంద్రంగా నిలబెడుతోందని, యువశక్తిని అనుకూలంగా మలుచుకోవడానికి ఇది తమకు అవసరమని, అందుకోసమే తాము ‘మేక్ ఇన్ ఇండియా’నుప్రారంభించామని కూడా ఆయన చెప్పారు. కాగా, సిఈఓల ఫోరం స్టార్టప్‌లు, ఫార్మా, జీవ శాస్త్రాలు, హోమ్‌లాండ్ సెక్యూరిటీ, వ్యవసాయం, విద్యుత్, జల వనరులకు సంబంధించి ఆరు జాయింట్ కమిటీలను ఏర్పాటు చేసింది.
12 ఒప్పందాలపై సంతకాలు
ఇదిలా ఉండగా, టెల్ అవివ్‌లో గురువారం జరిగిన సిఈఓల ఫోరం తొలి సమావేశంలో భారత్,ఇజ్రాయెల్ కంపెనీల మధ్య 4.3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు ఫిక్కీ న్యూఢిల్లీలో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కేవలం 4 బిలియన్ డాలర్ల మేరకు ఉన్న వాణిజ్యం రాబోయే అయిదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి అన్ని అవకాశాలున్నాయని కూడా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయిందని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఫోరం సభ్యులు రెండు దేశాల అధినేతలకు కొన్ని కీలక సిఫార్సులను సూచించారని కూడా ఆ ప్రకటన తెలిపింది. సమావేశం అనంతరం ఫోరం సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి సమావేశంలో తాము చర్చించిన అంశాలపై ఒక నివేదికను వారికి సమర్పించారు. మన ప్రధాని చరిత్రాత్మక పర్యటన సందర్భంగా ఇరు దేశాల కంపెనీల మధ్య మధ్య 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలియజేయడానికి ఆనందంగా ఉందని ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ ఆ ప్రకటనలో తెలిపారు.

చిత్రాలు.. టెల్ అవీవ్‌లో గురువారం ఇజ్రాయెల్-్భరత్ సిఇఓల ఫోరమ్ సమావేశానికి హాజరైన
ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు