బిజినెస్

సంప్రదాయేతర ఇంధన వనరుల వృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: దేశంలో 2020 నాటికి అవసరమయ్యే ఇంధనంలో 60 శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డెల్ కంపెనీ ప్రకటించింది. సౌరశక్తిని ఒడిసిపట్టే ప్రయత్నం తమ కంపెనీ చేస్తోందని డెల్ ఉపాధ్యక్షుడు దీపక్ ఒలియాన్ తెలిపారు. రెండు భారీ ఆన్‌సైట్ సౌర విద్యుత్ కేంద్రాలు, థర్డ్ పార్టీ ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని సేకరించి, 50 శాతం డిమాండ్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందించే స్థితిలో కంపెనీ ఉందని తెలిపారు. వినూత్న చర్యల్లో భాగంగా టాటా పవర్ లిమిటెడ్‌తో ఏడాది క్రితం డెల్ ఒప్పందం కుదుర్చుకుని బెంగళూరు వైట్ ఫీల్డ్ క్యాంపస్‌లో 120 కెడబ్ల్యూపి శక్తికలిగిన సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని దీపక్ ఒలియాన్ శనివారం ఓ ప్రకటనలో చెప్పారు.