బిజినెస్

ఇండియన్ ఆయిల్ తెలుగు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వ్యవహారాలను పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాహుల్ భరద్వాజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లోని ఆర్‌ఎ పోదార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంబిఎ డిగ్రీ, మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన రాహుల్ భరద్వాజ్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో వేర్వేరు హోదాల్లో సేవలు అందించారు. అంతేగాకుండా మారిషస్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ సిఇఒగా కూడా పనిచేశారు. మారిషస్‌లో ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయడమేగాక, ఆ కంపెనీకి ఆయన చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.