బిజినెస్

వీటికి జిఎస్‌టి వర్తించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: తమతమ ఉద్యోగులకు ఆయా సంస్థలు ఇచ్చే నగదు బహుమతులకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో మినహాయింపును ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 50,000 రూపాయల వరకు జిఎస్‌టి వర్తించదని పేర్కొంది. అలాగే క్లబుల్లో, హెల్త్, ఫిట్నెస్ సెంటర్లలో సభ్యత్వం ఉచితమని స్పష్టం చేసింది. ఏ సంస్థ అయినాసరే తమ ఉద్యోగులకు క్లబ్, హెల్త్, ఫిట్నెస్ సెంటర్ సభ్యత్వాన్ని అందిస్తే.. అది జిఎస్‌టి పరిధిలోకి రాదని తెలిపింది. ఉద్యోగికి సంస్థ ఇచ్చే బహుమతి, పెర్క్స్‌పై జిఎస్‌టి ఉంటుందా? అన్నదానికి బదులుగా సోమవారం కేంద్ర ప్రభుత్వం పైవిధంగా స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులకు సంస్థలు అందించే వసతి సదుపాయానికి కూడా జిఎస్‌టి వర్తించదంది. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో వచ్చిన జిఎస్‌టిలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఈ నెల 1 నుంచి జిఎస్‌టి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినది తెలిసిందే.